చిరంజీవి తర్వాత అల్లు అర్జునే..వర్మ వైరల్ స్టేట్మెంట్.!

Published on Aug 24, 2021 10:04 am IST

ఎప్పుడూ ఏదొక సంచలన మూమెంట్ తో సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా అర్ధం కానీ ట్వీట్స్ వేస్తూ ఏదొక కాంట్రవర్సీని రేపుతూ ఉండే వర్మ రీసెంట్ గా అల్లు అర్జున్ పై పడ్డాడు.

అయితే మొన్న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా కుటుంబం అంతా ఎంతో ఆహ్లాదంగా హాజరయ్యి పాల్గొన్న ఈ వేడుకల్లో బన్నీ మిస్సవ్వడం ఎప్పుడూ డౌట్స్ తో ఉండే వాళ్ళకి మరో రసవత్తర ప్రశ్నగా నిలిచింది. మరి దీనికి మరింత ఆద్యం పోస్తూ పలు సంచలన ట్వీట్స్ పెట్టడం స్టార్ట్ చేసాడు ఆర్జీవీ.

అయితే ఈ క్రమంలో లేటెస్ట్ గా ఇంకో ట్వీట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్ళీ మెగాస్టార్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ నే అని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది కాస్తా వైరల్ అవుతుంది. అయితే ఎప్పుడూ రకరకాల ట్వీట్స్ పెట్టే వర్మ గత కొన్నాళ్ల కితం అల్లు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ ఏదో సినిమా చేస్తా అని సెన్సేషన్ రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :