లైన్ క్లియర్ అయ్యిన “పుష్ప” కి రెండు డేట్స్.?

Published on Aug 26, 2021 8:05 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల కానుంది. అయితే ఇప్పటికే మొదటి పార్ట్ “పుష్ప ది రైజ్” కి కావాల్సినంత హైప్ ఉండగా మేకర్స్ దానిని మరింత పెంచే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుగా డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా అప్పుడు పోటీ మరిన్ని భారీ చిత్రాలతో ఉంటుందని టాక్ వచ్చింది.

కానీ వాటిలో కేజీయఫ్ 2 తప్పుకోవడంతో దీనికి లైన్ క్లియర్ అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొత్త బజ్ వినిపిస్తుంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం మేకర్స్ డిసెంబర్ 24న కానీ అంతకు ముందు వారంలో గాని రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఎలాగో క్రిస్మస్ రేస్ అన్నారు కాబట్టి 24నే వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :