ఆ రాబోయే సినిమాను మెగాస్టార్ స్పెషల్ షో చూస్తారట!

ఆ రాబోయే సినిమాను మెగాస్టార్ స్పెషల్ షో చూస్తారట!

Published on Jun 4, 2020 10:01 PM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే ఓ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీని తర్వాత ప్రాజెక్టులతో కూడా సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఈ లాక్ డౌన్ అనంతరం మెగాస్టార్ ఓ సినిమాను స్పెషల్ షో వేసుకొని మరీ చూస్తారట.

ఆయన అంతలా ముచ్చట పడి చూడబోయే సినిమా మరెవరిదో కాదు మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వస్తున్న యువ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన “ఉప్పెన” సినిమా. విడుదలకు ముందే మంచి బజ్ ను క్రియేట్ సంతరించుకుంది. దీనితో మెగాస్టార్ ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూడాలని ఆసక్తి కనబరుస్తున్నారట.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ రోల్ లో కనిపించనుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు