వైరల్ అవుతున్న పవన్, తారక్ లేటెస్ట్ లుక్స్.!

Published on May 31, 2021 3:01 pm IST

మన టాలీవుడ్ లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా ఒకరు. ఈ ఇద్దరి మాస్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మరి అలాగే ఆ మధ్య “అరవింద సమేత” సినిమా క్లాపింగ్ కు త్రివిక్రమ్ మూలాన ఒకే ఫ్రేమ్ లో ఇద్దరినీ చూసే అవకాశం వారి అభిమానులకు సహా ఆడియెన్స్ కి కూడా వచ్చింది.

అయితే ప్రస్తుతం భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న వీరిద్దరూ కొన్ని రోజుల కితమే కరోనా బారిన పడి పూర్తిగా కోలుకొని బయటకి వచ్చారు. కానీ అప్పటి నుంచి మాత్రం వీరి దర్శనం అభిమానులకు దక్కలేదు. దీనితో కొన్నాళ్లుగా కోలుకున్నాక వారు ఎలా ఉన్నారా అని చూడాలని కుతూహలం ఎక్కువైంది. మరి మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోల రీసెంట్ లుక్స్ ఇపుడు బయటకి వచ్చింది వైరల్ అవుతున్నాయి.

వాటిలో పవన్ తన కొడుకు అకీరాతో కలిసి చాలా సింపుల్ గానే కనిపించగా తారక్ లుక్ కూడా తన కొడుకు వలనే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. తారక్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ అక్షరాభ్యాసం సందర్భంగా జరిపిన కార్యక్రమం మూలాన తన లేటెస్ట్ లుక్ బయటకి వచ్చింది. దీంతో చాలా రోజులకి బయటకి వచ్చిన ఈ ఇద్దరి స్టార్ హీరోల లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :