“సలార్”తో పాటు “ఆదిపురుష్” కి రేస్ లో వారే.?

Published on May 29, 2021 7:30 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” ఒకటి కాగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస గాథ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఒకదాన్ని మించి ఒకటి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ రెండు సినిమాలు సెపరేట్ జానర్స్ గా సిద్ధం అవుతున్నాయి.

అయితే ఇది వరకే సలార్ అనౌన్సమెంట్ తోనే ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు రికార్డు స్థాయి ధర దానిని డిజిటల్ హక్కులకు ఇచ్చారని టాక్ ఆ మధ్య వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు “ఆదిపురుష్” స్ట్రీమింగ్ హక్కుల విషయంలో కూడా రేస్ లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :