సూపర్ స్టారే అనుకుంటే.. మెగాస్టార్ కూడా !

సూపర్ స్టారే అనుకుంటే.. మెగాస్టార్ కూడా !

Published on Sep 24, 2019 6:39 PM IST

Ganesh

హీరో వరుణ్ తేజ్, ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గద్దలకొండ గణేష్’ సినిమాని చూశారు. సినిమా చాల బాగుందని చిత్రబృందాన్ని అభినందించారు. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాను వీక్షించి.. ‘సినిమాని బాగా ఎంజాయ్ చేశానని, దర్శకుడు హరీశ్ శంకర్, 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మహేష్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా సుమారు రూ.15 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. కాగా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో కొత్త క్యారెక్టర్‌ లో కనిపించాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ కూడా సినిమాలో హైలెట్ అయ్యాయి. ఇక ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించగా.. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు