తమన్నా బాగా హైలెట్ అవుతోందిగా

Published on Sep 20, 2019 2:03 am IST

నిన్న విడుదలైన ‘సైరా’ ట్రైలర్లో ప్రధాన ప్రధాన పాత్రల్ని రివీల్ చేశారు. వాటిలో తమన్నా రోల్ కూడా ఉంది. ఇందులో ఆమె ఒక నృత్యకారిణి పాత్ర చేసింది. ట్రైలర్లో ప్రధాన హీరోయిన్ నయనతారతో సమానంగా తమన్నా చెప్పిన డైలాగ్స్, ఎమోషనల్, ఇంటెన్స్ షాట్స్ చూస్తే కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని అర్థమవుతోంది.

మొదట సినిమాలో తమన్నా నటిస్తుందని కన్ఫర్మ్ అవగానే ఏదో చిన్న పాత్ర అయ్యుంటుందని, మహా అయితే ఒక పాట కోసం తీసుకుని ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదలతో మిల్కీ బ్యూటీ పాత్ర పెద్దదని, ఆమెకు, చిరుకు మద్య బలమైన ట్రాక్ ఉంటుందని, ఆమె కూడా యుద్ద సన్నివేశాల్లో ఉంటుందని అర్థమైపోయింది.

దీంతో ఒక్కసారిగా తమన్నా హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా గనుక మంచి విజయాన్ని అందుకుంటే తమన్నా కెరీర్ మరింత బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక తమన్నా సైతం డ్రీమ్ టీంతో కలిసి డ్రీమ్ రోల్ చేశానంటూ సంబరపడిపోతోంది.

సంబంధిత సమాచారం :

X
More