ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మాటలు లేని సినిమా “గాంధీ టాక్స్”.. కానీ

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మాటలు లేని సినిమా “గాంధీ టాక్స్”.. కానీ

Published on Feb 28, 2026 12:40 AM IST

Gandhi-Talks

ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన రేర్ జానర్స్ లో అసలు మాటలే లేని సినిమాల జానర్ కూడా ఒకటి. మరి ఈ జానర్ లో రీసెంట్ గా వచ్చిన ఎమోషనల్ చిత్రమే “గాంధీ టాక్స్”. కోలీవుడ్ ప్రముఖ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే అరవింద స్వామి కీలక పాత్రల్లో దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించిన చిత్రమే ఇది.

ఎలాగో మాటలు లేవు కాబట్టి మన దగ్గర కూడా రిలీజ్ అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఆదరణ అందుకోలేదు కానీ తమిళ నాట మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని రాణించింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

కానీ ఈ చిత్రం ప్రస్తుతం కేవలం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. సో కొంత మొత్తం చెల్లించి మాత్రమే ఈ సినిమా చూడాలి. కిన్ని రోజులు తర్వాత రెంటల్ ఫ్రీగా వస్తుంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జీ స్టూడియోస్ వారు నిర్మాణం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు