రిలీజ్ డేట్ ఏమో కానీ..పోస్టర్ తో పీక్స్ కి వెళ్లిన “పుష్ప” అంచనాలు!

Published on Jan 28, 2021 10:55 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మరి ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ వస్తుంది అని మేకర్స్ అలెర్ట్ చేయడంతోనే అదేమిటా అన్న ఉత్సుకత ఒక్కసారిగా ఫ్యాన్స్ లో మెదిలింది.

మరి వారు పెట్టుకున్న అంచనాలకు మించే విధంగానే ఊరమాస్ మాస్ పోస్టర్ ను వదులుతారని మాత్రం ఊహించి ఉండరు. ఇక ఇదే అనుకుంటే ఇందులోనే ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించేయడం మరో అదిరిపోయే అప్డేట్. అయితే దీని కంటే కూడా అసలు ఈ పోస్టర్ లోని బన్నీ మాస్ లుక్కే అంతా డామినేట్ చేసేస్తోంది అని చెప్పాలి.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నాయకుడిలా తన టీం మధ్యలో గొడ్డలి పట్టుకొని ఉన్న బన్నీను చూస్తే ఈ సినిమాలో యాక్షన్ పాళ్ళు ఏ స్థాయిలో ఉండనున్నాయో సుకుమార్ ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో అన్నది అర్ధం అవుతుంది. ఇక అలాగే పాన్ ఇండియన్ వైడ్ కూడా బన్నీ మొదటి అడుగే సెన్సేషన్ నే నమోదు చేసేలా క్లియర్ గా కనిపిస్తుంది.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగక తప్పదు. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :