మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి ‘టాక్సిక్’ పెద్ద అడ్డంకిగా మారుతుందని అందరూ భావించారు.
అయితే ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో, ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపుతూ గట్టి పోటీ ఇస్తోంది. ‘టాక్సిక్’ చిత్రానికి తొలి రోజు భారీ ఓపెనింగ్ లభించినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లలో కొంత డ్రాప్ కనిపించడం, అలాగే ఆ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఉండటం ‘ఇరుముడి’కి కలిసొచ్చే అంశాలుగా మారాయి.
కుటుంబసమేతంగా చూడదగ్గ ఎమోషన్స్, అయ్యప్ప భక్తి నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండో వీకెండ్‌లోనూ ఇదే జోరు కొనసాగితే, బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ లాంగ్ రన్‌లో మరిన్ని మంచి వసూళ్లను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


