‘వి’ తర్వాత “టక్ జగదీష్” కి కూడా సాలిడ్ ప్రమోషన్స్!

Published on Aug 31, 2021 8:01 am IST


నాచురల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. తన హిట్ దర్శకుడు నిర్వాణ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇంకొన్ని రోజుల్లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా నాని గత చిత్రం “వి” కి ఏ తరహా ప్రమోషన్స్ సోషల్ మీడియాలో మరియు ఓటిటి లో జరిగాయో అదే రీతిలో అంతకు మించే విధంగా ఈ సినిమాకి కూడా జరుగుతున్నాయి.

మొదటి రోజే సాధ్యమైనంత వరకు భారీ ఎత్తున వ్యువర్స్ ని అందుకోవాలని చూస్తున్నారేమో కానీ ప్రైమ్ వీడియో సహా పలు ఓటిటి హ్యాండిల్స్ మరియు టాలీవుడ్ కి చెందిన సినీ పి ఆర్ ఓ లు కూడా తమ హ్యాండిల్స్ కి టక్ యాడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం వి కి కూడా ఇలానే మంచి హైప్ తీసుకొచ్చారు. దానితో అనుకున్న అంచనాలు అందుకోకపోయినా ఆ ఏడాదికి భారీ వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :