విజయ్ తర్వాత కూడా పూరి మరో పాన్ ఇండియా ఫిల్మ్.?

Puri Jagannadh

మన టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే కథలను సిద్ధం చేసి అంతే జెట్ స్పీడ్ లో సినిమాను పూర్తి చేసి విడుదల చెయ్యడం పూరి ప్రత్యేకత. “ఇస్మార్ట్ శంకర్” లాంటి భారీ హిట్ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ వలన షూటింగ్ కు కాస్త గ్యాప్ రాగా ఈ గ్యాప్ లో పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేసేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని కూడా భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా తీర్చి దిద్దాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకపక్క ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనిలో ఉంటూనే మరోపక్క క్యాస్టింగ్ విషయంలో కూడా పక్కా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ అనంతరం విజయ్ సినిమా పూర్తయ్యాక వెంటనే పూరి ఈ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారని ఇప్పుడు వినిపిస్తున్న టాక్..

Exit mobile version