ప్రభాస్ “సలార్” పై మళ్ళీ హాట్ టాపిక్స్.!

Published on Mar 31, 2021 6:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అయినటువంటి “సలార్” కూడా ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై గత కొంత కాలం నుంచి ఓ సస్పెన్స్ నడుస్తుంది.

ఈ సినిమా సబ్జెక్టు పూర్తిగా కొత్తదేనా లేక రీమేక్ నా అన్నది.. మొదట్లో కాదనే వచ్చింది కానీ ఆ మధ్య సంగీత దర్శకుడు అలాగే విడుదల తేదీ పోస్టర్ ను చూసి చెప్పిన దాని ప్రకారం ఆల్ మోస్ట్ “ఉగ్రమ్” కి రీమేక్ అని తేలింది. కానీ మళ్ళీ సలార్ యూనిట్ చెప్తున్నా దాని ప్రకారం సలార్ కంప్లీట్ కొత్త సబ్జెక్ట్ అని అది కూడా లాక్ డౌన్ లో సెట్టయ్యిందని తెలుపుతున్నారు.

దీనితో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ సలార్ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ రోల్ ఉగ్రమ్ లో రోల్ కి రిలేటెడ్ గానే ఉంది. మరి నీల్ ఏం చేస్తున్నాడో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :