మరోసారి బాలయ్య సరసన రాధిక ఆప్టే.?

మరోసారి బాలయ్య సరసన రాధిక ఆప్టే.?

Published on Aug 4, 2014 11:02 PM IST

balakrishna-and-radhika-apte

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా ఈ సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఆయన కాస్త గ్యాప్ తీసుకొని సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ‘లెజెండ్’ లోలానే బాలయ్య ఇందులో కూడా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఇందులో ఓ హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసిన విషయం మనకు తెలిసిందే.. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్రస్తుతం లెజెండ్ లో బాలయ్య సరసన కనిపించి మార్కులు కొట్టేసిన రాధిక ఆప్టేని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి రాధిక ఆప్టే కూడా అంగీకారం తెలుపుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇటీవలే రంపచోదవడం ఫారెస్ట్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతాజా షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు