గత ఏడాది తెలుగు సినిమా సంక్రాంతి బరిలో వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన చిత్రాల్లో వెంకీ మామ హీరోగా నటించిన భారీ హిట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఒకటి. రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే హిందీలో రీమేక్ చేస్తారని కూడా టాక్ వచ్చింది. హిందీలో ఓ దర్శకునితో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమా రీమేక్ చేస్తారని టాక్ వినిపించింది.
కానీ తర్వాత అవి మళ్ళీ వినిపించలేదు. అయితే లేటెస్ట్ గా మళ్ళీ ఈ రీమేక్ చర్చలు మొదలయ్యాయి. అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో మళ్ళీ చర్చ మొదలైంది. అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ కూడా హిందీలో ఓ సినిమా సైన్ చేసాడని రీసెంట్ గానే మాస్ మహారాజ్ రవితేజ రివీల్ చేశారు. సో ఆ సినిమా కూడా ఇదే అన్నట్టు వినిపిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ రూమర్స్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


