నిలిచి గెలిచిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

Published on Jun 24, 2019 11:00 pm IST

గత శుక్రవారం ఏకంగా ఆరు చిన్న సినిమాలు ‘మల్లేశం, ఓటర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, స్పెషల్, ఫస్ట్ ర్యాంక్ రాజు, గజేంద్రుడు’ విడుదలయ్యాయి. దీంతో పోటీ తీవ్రంగా మారింది. ఆరు సినిమాలు వేటికవే భిన్నమైన జోనర్ కావడంతో ఏది ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుందో చెప్పడం కొద్దిగా కష్టంగానే మారింది. చివరికి తీవ్రమైన పోటీ నడుమ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకుల ఆదరణను ఎక్కువగా పొంది గెలిచాడు.

మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో శని, ఆదివారాల్లో సినిమాకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువైంది. సీరియస్ క్రైమ్ ఎలిమెంట్, మంచి సస్పెన్స్, ఇవెస్టిగేషన్ ఎపిసోడ్స్, నవీన్ పోలిశెట్టి నటన, జన్యూన్ కామెడీ ట్రాక్ అన్నీ కలిసి సినిమాను హిట్ చేశాయి. మొదటి వారాంతంలో సినిమా 1.5 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్లో సైతం 1,30,000 డాలర్లను కలెక్ట్ చేసింది. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ సినిమాను స్వరూప్ ఆర్.ఎస్.జె డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More