‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

Published on Jun 27, 2019 6:02 pm IST

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన చిత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఆ తరువాత రోజుల నుంచీ ఈ సినిమాకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువైంది. అలాగే ఓవర్సీస్లో సైతం విడుదలైన ఆరు రోజులకి మొత్తం $ 188,427 డాలర్లను కలెక్ట్ చేసింది.

సీరియస్ క్రైమ్ ఎలిమెంట్, మంచి సస్పెన్స్, ఇవెస్టిగేషన్ ఎపిసోడ్స్, నవీన్ పోలిశెట్టి నటన, జన్యూన్ కామెడీ ట్రాక్ అన్నీ కలిసి సినిమాను హిట్ చేశాయి. ఇక న‌వీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More