కృష్ణా, గుంటూరులో ‘అజ్ఞాతవాసి’ 6 రోజుల వసూళ్లు !


పవన్ కళ్యాణ్, త్రివిక్రంల ‘ఆజ్ఞాతవాసి’ చిత్రం ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విదుడాలి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మిక్స్డ్ టాక్ వ్యాపించడంతో కలెక్షన్ల పరంగా కొంత వెనుకబడింది. కృష్ణా జిల్లాల్లో తొలిరోజు రూ.1.82 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం 2వ రోజు నుండి డీలాపడి 6వ రోజు రూ.26.20 లక్షలతో మొత్తంగా రూ.2.84 కోట్లను ఖాతాలో వేసుకుంది.

అలాగే గుంటూరు ఏరియాలో ఫస్ట్ డే రూ.3.78 కోట్లను కొల్లగొట్టి అనుకూలంగాలేని మౌత్ టాక్ మూలాన తగ్గుముఖంపట్టి 6వ రోజు రూ.28.64 కోట్లను ఖాతాలో వేసుకుని ఇప్పటివరకు టోటల్ గా రూ.4.81 కోట్ల షేర్ మార్కును అందుకుంది. ఈ రెండు ఏరియాల్లో కూడా అమ్ముడైన మొత్తం చాలా ఎక్కువగా ఉండటం వలన డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే కలెక్షన్స్ మెరుగుపడాల్సి ఉంది.