‘ఆహా’లో ఈ వారంతం డబుల్ ధమాక..!

Published on Jun 30, 2021 12:10 am IST


కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తుంది. అయితే తెలుగు ఓటీటీ మాధ్య‌మాలలో ఒకటైన ‘ఆహా’ ఎప్పటికప్పుడు వీక్షకులకు మంచి మంచి సినిమాలను అందిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ‘ఆహా’ తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఈ వారాంతంలో డ‌బుల్ ట్రీట్ అందించ‌డానికి రెడీ అయ్యింది. హై ఓల్టేజ్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పొగ‌రు’, పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో రూపొందిన ప్రేమ క‌థా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారం కాబోతున్నాయి.

అయితే ధృవ్ స‌ర్జా, గీతా గోవిందం ఫేమ్ ర‌ష్మిక మంద‌న్న జంటగా న‌టించిన ‘పొగ‌రు’ చిత్రాన్ని నంద కిశోర్ తెర‌కెక్కించారు. ఈ సినిమా విషయానికి వస్తే చిన్న‌ప్పుడు తండ్రిని కోల్పోయిన శివ త‌ల్లి ప్రేమ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. బ‌య‌ట‌కు చూడ‌టానికి క‌ఠినంగా ఉంటూ కొన్ని క‌ఠిన ప‌రిస్థితుల్లో జీవిస్తున్న శివ మ‌న‌సు మాత్రం బంగారం. అత‌ని సోద‌రి జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న కార‌ణంగా అవ‌స‌రంలోని వ్య‌క్తుల‌కు మెస‌య్య‌లా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఈ క్ర‌మంలో శివ త‌న జీవితంలో ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు? అనేదే ఈ క‌థ‌.

ఇక ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాన్ని ధూళిపూడి ఫ‌ణి ప్ర‌దీప్ తెర‌కెక్కించారు. అర్జున్‌, ఆకర్ష అనే ఇద్ద‌రు కాలేజ్ స్టూడెంట్స్‌కి చుట్టూ తిరిగే క‌థ‌. ప్ర‌థ‌మార్థంలో ఒక‌రంటే ఒక‌రికి ద్వేష‌ముంటుంది. అనుకోని ప‌రిస్థితుల్లో వీరిద్ద‌రికీ వారి గ‌త జీవితం గురించి తెలుస్తుంది. అయితే అక్క‌డే క‌థ‌లో అనుకోని ట్విస్ట్ వ‌స్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి.

అయితే మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ “పొగరు”, చక్కటి ప్రేమ క‌థా చిత్రమైన “30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?” సినిమాలతో ఒకే రోజు మాస్‌తో పాటు క్లాస్ కథలను కోరుకునే వారిని జూలై 2వ తేదిన ‘ఆహా’ కనువిందు చేయబోతుందన్న మాట. ఇక వీటితో పాటు ‘క్రాక్‌, నాంది, జాంబి రెడ్డి, లెవ‌న్త్ అవ‌ర్‌, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా, జీవి, ఎల్‌.కె.జి’ వంటి తెలుగు బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను కూడా ఆహాలో వాక్షిస్తూ ఎంజాయ్ చేయండి.

సంబంధిత సమాచారం :