టీజర్ తో రానున్న లేడీ సూపర్ స్టార్ !

టీజర్ తో రానున్న లేడీ సూపర్ స్టార్ !

Published on Jan 2, 2019 5:19 PM IST

Airaa
గత ఏడాది ‘కొలమావు కోకిల, ఇమ్మైక నొడిగళ్’ చిత్రాలతో బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సొంతం చేసుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇక ప్రస్తుతం ఆమె తన 63 వ చిత్రం ‘ఐరా’ లో నటిస్తుంది. సర్జున్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ ఫస్ట్ టైం రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుంది. ఈచిత్రం యొక్క టీజర్ ను ఈనెల 5న సాయంత్రం విడుదలచేయనున్నారు.

కేజేఆర్ స్టూడియోస్ , ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదలకానుంది. ఇక ఇదిలావుంటే నయన్ ఈ ఏడాది ఈ చిత్రం తో కలిపి నాలుగు చిత్రాలతో ప్రేక్షకులముందుకు రానుంది. అందులో ‘విశ్వాసం , సైరా ,తలపతి 63’ వంటి బడా చిత్రాలు ఉండడం విశేషం.

తాజా వార్తలు