ఎయిర్ టెల్ తో ఫేమస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul-Preet-Singh
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా విజయంతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్న ఈ భామ ఈ సంవత్సరం ‘యారియాన్’ అనే హిందీ సినిమాలో కూడా నటించి హిట్ అందుకుంది.

సినిమాలు కాకుండా తను ఇటీవలే ఎయిర్ టెల్ కోసం చేసిన ప్రకటనలు కూడా తనకి మంచి గుర్తింపును తెచ్చాయి. ఐపిఎల్ టి20 టైములో చేసిన ఈ ప్రకటనలకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇండియా మొత్తం తనని ‘ఎయిర్ టెల్ యాడ్ గర్ల్’ అనే పేరుతో పిలుస్తున్నారు.

ఈ ప్రకటనపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ ‘నాకు స్క్రిప్ట్ చాలా క్యూట్ గా అనిపించింది. ఇది యువతకి, యంగ్ కపుల్స్ కి బాగా నచ్చుతుందనుకున్నానని’ తెలిపింది.

Exit mobile version