యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్ కుమార్తె

యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్ కుమార్తె

Published on Mar 11, 2015 8:32 AM IST

Aishwarya-Rai-daughter
ఇండియన్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాయ్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆరాధ్య బచ్చన్ కి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఐశ్వర్య రాయ్ త్వరలోనే తన కం బ్యాక్ మూవీతో రానుంది. ఇది పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ కుమార్తె, అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ అప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుంటోంది.

ఓనమాలు నేర్చుకోవడమే కాకుండా అప్పుడు నటనలో తన మొదటి స్టేజ్ పెర్ఫార్మన్స్ ని కూడా ఇచ్చేసింది. ఈ క్యూట్ లిటిల్ గర్ల్ ఆరాధ్య ప్రసతుతం స్కూల్ కి వెళుతోంది. రీసెంట్ గా స్కూల్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో ఆరాధ్య స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ వేడుకకి బిగ్ బి, అతని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఆరాధ్య పెర్ఫార్మన్స్ ని మెచ్చుకున్నారు. ఆరాధ్య జీన్స్ తనని తప్పకుండా హీరోయిన్ గా ప్రేక్షకులకి పరిచయం చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు