మైరా హన్సన్ గా “రిపబ్లిక్” లో ఐశ్వర్యా రాజేష్!

Published on Aug 27, 2021 1:00 am IST

దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ పంజా అభిరామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ సైతం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుండి ఐశ్వర్య రాజేష్ పాత్ర కి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల అయింది. ఈ చిత్రం లో ఐశ్వర్యా రాజేష్ మైరా హాన్సన్ గా నటిస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల అయింది. కూలిపోతాం, కుంగిపోతాం, ఓడి పోతాం, అయినా నిలబడతాం, కొలుకుంటాం, గెలుస్తాం అంటూ ఉన్న కొటేషన్ తో ఐశ్వర్య రాజేష్ పోస్టర్ ఉంది. ఈ చిత్రం ను అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :