‘పుష్ప’ హీరోయిన్ రష్మిక గారిని నేను కించపరచలేదు – ఐశ్వర్య రాజేష్

Published on May 17, 2023 11:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా దాదాపుగా ఏడాదిన్నర క్రితం పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విషయం ఏమిటంటే, ఇటీవల ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫర్హానా మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి సైతం మంచి ప్రసంశలు అందుకుంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది.

ఇక ఈ తాజాగా సినిమా యొక్క ప్రమోషన్స్ సమయంలో, తెలుగులో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారని మీడియా ప్రతినిధి ఒకరు ఆమెను ప్రశ్న అడిగారు. కాగా తాను పుష్పలోని శ్రీవల్లి వంటి పాత్రలకు బాగా సూటవుతానని ఐశ్వర్య తెలిపారు. కాగా పుష్పలో రష్మిక పాత్రని ఐశ్వర్య కించపచారని కొందరు ఆమె ఈ మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలెట్టారు. దానితో కొద్దిసేపటి క్రితం తన వ్యాఖ్యల పై ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు ఐశ్వర్య రాజేష్. నిజానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరియు తన తోటి నటులు, నటీమణులందరిపై తనకు ప్రగాఢమైన అభిమానం తప్ప మరేమీ లేదని, దయచేసి ఇలాంటి తప్పుడు పుకార్లను ఆపాలని ఐశ్వర్య రాజేష్ తన ప్రకటన ద్వారా కోరారు.

సంబంధిత సమాచారం :