ఇకపై అలాంటి పాత్రలు చేయనంటున్న ఐశ్వర్య రాజేశ్..!

Published on Mar 14, 2020 11:20 pm IST

తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తెలుగు, మళయాళం సినిమాలలో కూడా నటించి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోవింగ్ ఏర్పరుచుకున్నారు. అయితే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మరియు ‘కౌసల్య కృష్ణమూర్తి’ వంటి సినిమాలు చేసిన ఈ అమ్మడు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే పలు సినిమాలలో ఐశ్వర్య హీరోయిన్‌గానే కాకుండా తల్లిగా, చెల్లిగా కూడా కనిపించారు. అయితే ఈ అమ్మడు తల్లి పాత్రలో నటించడంతో పలువురు యంగ్ హీరోలు ఆమెతో నటించేందుకు ఒప్పుకోవడంలేదట. దీంతో ఆమె ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

More