తెలుగులో బిజీ అయిపోతున్న ఐశ్వర్య

Published on Dec 4, 2019 9:20 am IST

ఇతర భాషల హీరోయిన్లు తెలుగు పరిశ్రమ మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. అవకాశం దొరికితే తమ టాలెంట్ నిరూపించుకుని ఇక్కడే సెటిలైపోవాలని అనుకుంటుంటారు. ఇప్పటికే చాలామంది పర భాషా నటీమణులు అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని టాలీవుడ్లో సెటిలైపోగా ఇప్పుడు మరొక తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఆడే పనిలో ఉంది.

తమిళ చిత్రం ‘కన’ యొక్క తెలుగు రీమేక్ ‘కౌసల్య సుబ్రమణ్యం’తో తెలుగువారిని పలకరించిన ఆమె వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ యొక్క ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటిస్తున్న ఆమె తాజాగా అనౌన్స్ అయిన నాని, శివ నిర్వాణల ‘టక్ జగదీష్’ చిత్రంలో కూడా కథానాయకిగా అవకాశం కొట్టేసింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాల్ని సాధిస్తే ఐశ్వర్య తెలుగులో మరింత బిజీ అయిపోవడం ఖాయం. ఇకపోతే ఆమె కథానాయకిగా నటించిన ‘మిస్ మ్యాచ్’ డిసెంబర్ 6న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More