వారిద్దరితో ఫోటో చాల ప్రత్యేకం అంటున్న ఐశ్వర్య.

Published on Mar 16, 2020 5:16 pm IST


తమిళంలో దూసుకుపోతున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన తమిళ చిత్రం కన్నా తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరుతో రీమేక్ అయ్యింది . ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో గృహిణిగా స్వర్ణ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆమె కట్టిపడేసింది. నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు.

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న సిమ్రాన్, జ్యోతిక లతో దిగిన ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పాటు, ఆ ఫోటో ఆమెకు చాల విలువైనది అన్నట్లు కామెంట్ పెట్టారు. ఓ అవార్డుల వేడుకలో భాగంగా ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో ఐశ్వర్య ఫోటో దిగినట్టు తెలుస్తుంది. సిమ్రాన్, జ్యోతిక ఇప్పటికీ తగు పాత్రలలో నటిస్తూ తమిళ పరిశ్రమలో ముందుకు వెళుతున్నారు.

సంబంధిత సమాచారం :

More