కేన్స్ లో అలరిస్తున్న “ఐశ్వర్య” సోయగం

Published on May 20, 2019 9:33 am IST

కేన్స్ మూవీ ఫెస్టివల్ సంధర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ కి చెందిన ముద్దుగుమ్మలు ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన హాట్ హాట్ డ్రెస్సెస్ లో వీక్షకుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రియాంక, దీపికా, కంగనా వంటి స్టార్స్ డిజైనర్ డ్రెస్ లలో సెక్సీ ఫోజులతో కేన్స్ ఫెస్టివల్ లో మెరిశారు. తాజాగా నిన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ రెడ్ కార్పెట్ పై తాళుకులీనారు . గోల్డెన్ గ్రీన్ కలర్ లో ఉన్న ఫిష్ కట్ డిజైనర్ డ్రెస్ లో వచ్చిన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నిజంగా మత్య కన్య దిగివచ్చినదా అన్నట్లు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే నాలుగు పదుల వయసులో వున్న ఐశ్వర్య నేటి తరం హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని అందంతో వారికి గట్టిపోటీనిస్తున్నారు. ఈ సారి ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్య తనకు కూతురు ఆరాధ్య తో కలిసి పాల్గొనడం మరో విశేషం.

సంబంధిత సమాచారం :

More