‘భారతీయుడు 3’ విషయంలో శంకర్ కి మరో చిక్కు?

‘భారతీయుడు 3’ విషయంలో శంకర్ కి మరో చిక్కు?

Published on Mar 14, 2026 1:01 AM IST

iNDIAN3

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన పలు ఐకానిక్ చిత్రాల్లో దర్శకుడు శంకర్ తో చేసిన చిత్రం “భారతీయుడు” కూడా ఒకటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా సంచలన విజయం అప్పట్లో సాధించింది. అయితే దీనికి సీక్వెల్ గా పార్ట్ 2 ని అనౌన్స్ చేసినపుడు చాలామంది ఎగ్జైట్ అయ్యారు.

కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. శంకర్ ఇమేజ్ ని కూడా దారుణంగా పాడు చేసింది. ఇక దీనితో పార్ట్ 3 ముందుకు వెళ్లే సూచనలు పోయాయి. నిజానికి పార్ట్ 3 ట్రైలర్ చూసి ఇదే పార్ట్ 2 గా వదలాల్సింది అని చాలామంది భావించారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పటికీ కాదు అనేది దాదాపు ఖరారు అయ్యిపోయింది.

నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు పార్ట్ 3 ను ముందు తీసుకెళ్లలేం అని చెప్పేస్తున్నారట. చేస్తే శంకర్, కమల్ లు చేసుకోవాలని ఇక మీద తాము ఖర్చు చేయలేమని అలాగే ఒకవేళ శంకర్ కానీ భారతీయుడు 3 పూర్తి చేయకుండా వేరే సినిమా మొదలు పెడితే మాత్రం తనపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ తతంగం అంతా ఎక్కడికి వెళుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు