అన్నపూర్ణ కాంపౌండ్ లోకి హిట్ డైరెక్టర్ ?

Published on Apr 18, 2019 1:00 am IST

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ షేర్‌ను రాబట్టుకుంది. దీంతో అజ‌య్ భూప‌తికి బాగానే ఆఫర్స్ వచ్చాయి. మొదట రామ్ హీరోగా భవ్య మూవీస్ లో సినిమా ఉందన్నారు.. ఏమైందో ఏమో అది కాస్త క్యాన్సిల్ అయింది. ఈ లోపు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నారు.

ఆ మేరకు అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందో నాగచైతన్యతో తన తరువాత సినిమాను చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే అన్నపూర్ణ కాంపౌండ్ లోకి అజయ్ ఎంటర్ అయినట్లు కూడా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో చైతుతో సినిమా చెయ్యాలని అజయ్ ప్రపోజల్ చేశాడట. మరి మజిలీ మంచి హిట్ అందుకున్న చైతూ అజయ్ భూపతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :