‘ఖైదీ’ హిందీ రీమేక్లో స్టార్ హీరో

Published on Feb 28, 2020 7:19 pm IST

తమిళ చిత్రం ‘ఖైదీ’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో సైతం మంచి కలెక్షన్స్ సాధించింది. కొన్నాళ్లుగా దక్షిణాది పరిశ్రమల సినిమాలపై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను సంప్రదించింది. అజయ్ దేవగన్ సైతం చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేశారు. ఈ రీమేక్లో నటిస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ రీమేక్ నిర్మాణంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సైతం భాగస్వామ్యం వహించనుంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం :