రాజమౌళితో ఓ హిందీ సినిమా – అజయ్ దేవగన్

రాజమౌళితో ఓ హిందీ సినిమా – అజయ్ దేవగన్

Published on Dec 5, 2014 9:50 AM IST

Ajay-Devgn,-Rajamouli
హిందీ సినిమా చేసే సత్తా రాజమౌళికి ఉంది. ఆయన దర్శకత్వంలో నేను ఓ సినిమాలో నటించాలని కోరుకుంటున్నాను. అంటూ జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ హిందీ సినిమా హీరో అజయ్ దేవగన్. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ స్టార్ హీరో నటించిన ‘యాక్షన్ జాక్సన్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా చూశాను. ఆయన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అవకాశం కుదిరితే రాజమౌళితో ఓ హిందీ సినిమా చెయ్యాలనుంది.’ అని అజయ్ దేవగన్ అన్నారు.

‘మర్యాద రామన్న’ హిందీ రీమేక్ ‘సన్ అఫ్ సర్దార్’లో నటించిన అజయ్ దేవగన్.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హిందీలో రీమేక్ అయిన రాజమౌళి ఇతర సినిమాలు కూడా ఘన విజయాలు అందుకోవడంతో, అక్కడి అగ్ర హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి, రాజమౌళి ఎ హీరోకి ఒటేస్తారో..? ఎప్పుడు బాలీవుడ్ లో అడుగు పెడతారో..? వెయిట్ & సి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు