తండ్రి మరణించిన ఏడాదికే అజయ్ దేవగన్ ఇంట్లో మరో విషాదం

తండ్రి మరణించిన ఏడాదికే అజయ్ దేవగన్ ఇంట్లో మరో విషాదం

Published on Oct 6, 2020 8:37 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు అనిల్ దేవగన్ నిన్న సోమవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు అనిల్ దేవగన్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ నిన్నటి రాత్రి ఆకస్మికంగా మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ స్వయంగా తెలియజేశారు.

అజయ్ దేవగన్ తన ట్విట్టర్లో ‘గత రాత్రి నా సోదరుడు అనిల్‌ దేవగన్‌‌ను కోల్పోయాను. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అతనిని చాలా మిస్సవుతాను. అనిల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్‌ కారణంగా ఎలాంటి వ్యక్తిగత ప్రార్థనా సమావేశం నిర్వహించలేకపోతున్నాము’ అంటూ భావిద్వేగానికి గురయ్యారు. అనిల్ దేవగన్ ‘రాజు చాచా, బ్లాక్‌మెయిల్‌, హాల్‌-ఈ-దిల్‌’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. గత ఏడాది మే నెలలోనే అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ మరణించారు. ఇలా తండ్రి మరణించిన ఏడాదికే సోదరుడు కూడ దూరమవడంతో అజయ్ దేవగన్ తీవ్ర విషాదంలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు