ఒకప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ సాంగ్స్ ను రీమేక్ చెయ్యడమనేది ఈ మధ్య కాలంలో ఓ ఆనవాయితీ అయిపోయింది. తెలుగు తమిళ్ హిందీ ఇలా ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే.. ఒక సూపర్ హిట్ సాంగ్ తమ సినిమాలో పెట్టుకోవడానికి స్కోప్ ఉందంటే చాలు. ఏమాత్రం ఆలోచించకుండా తమ సినిమాల్లో పెట్టేసుకుంటున్నారు మేకర్స్ . ఆ కోవలోనే అజయ్ దేవగన్, టబు కాంబినేషన్ లో తొంభైలలో వచ్చిన ‘రుక్ రుక్…’ సాంగ్ ని కూడా తాజాగా రీమిక్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ముఖ్యపాత్రలో వస్తోన్న ‘హెలీకాఫ్టర్ ఈల’ చిత్రంలో ఈ ‘రుక్ రుక్’ పాట మళ్లీ రానుంది. ఈ సినిమాలో ఓ సింగర్ కావాలనుకునే ఓ గృహిణి పాత్రలో కాజోల్ నటిస్తోంది. తన భర్త సూపర్ హిట్ సాంగ్ కే కాజోల్ స్టెప్స్ వేస్తోంది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, జయంతీ లాల్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.