కలకత్తాలో బిజీబిజీగా అజిత్, శృతిహాసన్

ajith-sruthi
తమిళ నటుడు అజిత్ సరికొత్త చిత్ర షూటింగ్ తో గత కొన్ని వారాలుగా బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ చిత్ర బృందం ఇటలీలో ఒక షెడ్యూల్ ముగించుకుని వచ్చింది. ఈ సినిమాలో అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. శౌర్యం ఫేం శివ ఈ చిత్రానికి దర్శకుడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కలకత్తాలో విక్టోరియా మెమోరియల్ ముందు కొనసాగిస్తున్నారు. శృతిహాసన్ లాయర్ గా కనిపించనుంది. ఏ.ఎం రత్నం నిర్మాత. అనిరుధ్ సంగీతదర్శకుడు.

Exit mobile version