‘కమాండో’గా రానున్న అజిత్ !
Published on Aug 2, 2018 3:00 pm IST

యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తల అజిత్ నటించిన చిత్రం ‘వివేగం’. గత ఏడాది ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం పరాజయం పాలైయింది . ఈచిత్రాన్ని తెలుగులో వివేకం పేరుతో విడుదలచేశారు. ఇక్కడ కూడా పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఇటీవల ‘వీర్’ పేరుతో హిందీ లో విడుదల చేశారు అక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. తరువాత ఈ హిందీ వెర్షన్ ను యూ ట్యూబ్ లో విడుదల చేయగా కేవలం 24 గంటల్లో 8 మిల్లియన్ల వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డు ను సృష్టించింది.

దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘కమాండో’ పేరుతో కన్నడ భాషలో విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం అక్కడ భారీ స్థాయిలో విడుదల కానుంది. సుమారు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ నటించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook