కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు అదిక్ రవి చంద్రన్ తెరకెక్కించిన క్రేజీ మాస్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం అందరికీ తెలిసిందే. అజిత్ కెరీర్ లోనే గట్టి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు అందుకుంటుంది. ఇక తమిళనాట ఈ సినిమా సాలిడ్ నంబర్స్ అందుకుంటుంది.
మొదటి వారం లోపే 100 కోట్లకి పైగా గ్రాస్ ని ఒక్క తమిళ రాష్ట్రం నుంచే అందుకున్న ఈ చిత్రం రెండు వారాల్లో ఏకంగా 170 కోట్లకి పైగా రాబట్టినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో కోలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సెన్సేషన్ ని సెట్ చేస్తోంది అని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో ఇది 200 కోట్ల మార్క్ వరకు కూడా వెళుతుందో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.