అజిత్ లేటెస్ట్ లుక్…ఓ రేంజ్ లో ఉన్నాడుగా..!

Published on Feb 22, 2020 2:00 am IST

హీరో అజిత్ తన తాజా చిత్రం వాలిమై చిత్ర షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇటీవల ఆయన ఈ చిత్ర షూటింగ్ లో పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఐతే అదృష్టం కొద్దీ ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. గాయాలు మానే వరకు ఆయన చిత్ర షూటింగ్ కి విరామం ప్రకటించారు. కాగా అజిత్ ఓ ఫ్యామిలి వెడ్డింగ్ కి హాజరయ్యారు. సూటు బూటు నీట్ షేవింగ్ లో అజిత్ లుక్ కేకగా ఉంది. ఆ ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ముఖ్యంగా వాటిని వైరల్ చేస్తున్నారు.

ఇక వాలిమై షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అజిత్ మరో మారు పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. అందుకే గత చిత్రాలకు భిన్నంగా అజిత్ ఫుల్ షేవింగ్ లో కనిపిస్తున్నారు. వాలిమై చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. బోని కపూర్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో వాలిమై విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :