అజిత్ మొదలెట్టేస్తున్నాడు !

Published on Feb 15, 2019 9:40 pm IST

ఈ ఏడాది ప్రారంభంలో విశ్వాసం తో సూపర్ హిట్ కొట్డాడు తల అజిత్. పొంగల్ కానుకగా విడుదలైన ఈ చిత్రం 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత అజిత్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది.

తాజాగా ఈషూటింగ్ లో పాల్గొనడానికి అజిత్ హైదరాబాద్ చేరుకున్నాడు. దాదాపు 20 రోజుల పాటు అజిత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. విద్యాబాలన్ , శ్రద్దా శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోత్ తెరకెక్కిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :