ఆసక్తికరమైన పాత్రలో అజిత్ !

ఆసక్తికరమైన పాత్రలో అజిత్ !

Published on Aug 18, 2018 9:47 AM IST

తమిళ స్టార్ హీరో తల అజిత్ ‘శతురంగ వెట్టై , ‘తీరం అడిగారా ఒండ్రు’ చిత్రాల దర్శకుడు వినోత్ తెరకెక్కించనున్నచిత్రంలో నటించనున్నారని తెలిసిందే. ఈచిత్రంలో అజిత్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అమితాబచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో హిందీ భాషలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మించనున్న ఈచిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది.

ఇక ప్రస్తుతం అజిత్ , శివ తెరకెక్కిస్తున్న ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు