బోనీ కపూర్ నిర్మాణంలో అజిత్ మరో సారి !

Published on Dec 18, 2018 8:44 am IST


తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించనున్న 59వ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కనుందని తెలిసిందే . బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్న ఈచిత్రంలో అజిత్ , అమితాబ్ పోషించిన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదలకానుంది. ఇక ఈచిత్రం తరువాత అజిత్, బోనీ కపూర్ నిర్మాణంలో మరో చిత్రంలో నటించనున్నాడని బాలీవుడ్ చిత్ర వర్గాల కథనం.

ఇక ఇదిలావుంటే శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ విడుదలకు రెడీ అవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కు ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈచిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :