అజిత్ వివేగం కన్నడ వర్షన్ విడుదల తేదీ ఖరారు !
Published on Aug 22, 2018 11:56 pm IST

తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన చిత్రం ‘వివేగం’. గత ఏడాది ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులో ‘వివేకం’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా విజయం సాధించలేకపోయింది. అయితే కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రాన్నిహిందీ లో ‘వీర్’ పేరుతో విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలకు ఫిదా అయిన హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు.

దాంతో ఇప్పుడు ఈ చిత్రం కన్నడ భాషలో అనువాదం అయింది. ‘కమాండో’ పేరుతో ఆగస్టు 31న కన్నడ ప్రేక్షకులముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook