40కోట్ల మార్కుకి దగ్గరపడుతున్న అజిత్ చిత్రం

40కోట్ల మార్కుకి దగ్గరపడుతున్న అజిత్ చిత్రం

Published on Feb 18, 2015 1:01 AM IST

yennai-arindhaal
అజిత్ కుమార్, అనుష్క మరియు త్రిషలు నటించిన ”ఎన్నై అరిందాల్” సినిమా తమిళనాట విడుదలకు ముందే బాగా క్రేజ్ సంపాదించుకుంది. గౌతంమీనన్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి రివ్యూలతో దూసుకుపోతుంది.

తాజా సమాచారం ప్రకారం విడుదలైన నాటినుండి ఈ సినిమా 39కోట్ల 11 లక్షలు సంపాదించింది. అజిత్ పోలీస్ రోల్ లో, త్రిష గ్లామర్ రోల్ లో అభిమానులను మెప్పించారు. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో త్వరలో విడుదలకాబొతుంది.

తాజా వార్తలు