
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎన్నై అరిందాళ్’. గత ఫిబ్రవరి నెల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో గౌతమ్ మీనన్ ఉన్నారట. పూర్తి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఎన్నై అరిందాళ్’లో అజిత్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో అజిత్ యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇటు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కాగా ఇప్పటికే ‘ఎన్నై అరిందాళ్’ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని గౌతమ్ మీనన్ సిద్ధమయ్యారట. అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే ఈ సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్ళనుందని తమిళ సినిమా టాక్. ఇక ‘ఎన్నై అరిందాళ్’ సినిమా ‘ఎంతవాడుగానీ..’ పేరుతో తెలుగులో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఆడియో రిలీజ్ కూడా జరుపుకున్న ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

