జనవరి నుండి ప్రారంభం కానున్న అజిత్ కొత్త చిత్రం !

జనవరి నుండి ప్రారంభం కానున్న అజిత్ కొత్త చిత్రం !

Published on Aug 14, 2018 5:00 PM IST

స్టార్ హీరో తల అజిత్ ప్రస్తుతం శివ తెరకెక్కిస్తున్న ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. శివ కు అజిత్ తో ఇది 4వ చిత్రం. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో ‘వీరం, వేదాళం ,వివేగం’ సినిమాలు తెరకెక్కాయి. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్త్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

ఇక ఈ చిత్రం తరువాత అజిత్ ‘తీరం అడిగారా ఒండ్రు’ దర్శకుడు వినోత్ తెరకెక్కించనున్నచిత్రంలో నటించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు