స్టార్ హీరో సినిమా విదేశీ షెడ్యూల్ కోసం భారీ బడ్జెట్

Published on Jun 17, 2019 4:27 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది హిందీ చిత్రం ‘పింక్’కు తమిళ రీమేక్. ఈ చిత్రం తర్వాత కూడా అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించనున్నారు.

ఆగష్టు 29న లాంచ్ కానున్న ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందట. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా కొంత భాగం విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ భాగం ఈ విదేశీ షెడ్యూల్ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత,లొకేషన్ సెర్చ్ జరుగుతోందట. త్వరలోనే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కానుంది.

సంబంధిత సమాచారం :

X
More