ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ఎంతవాడు గాని’..?

ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ఎంతవాడు గాని’..?

Published on Feb 12, 2015 2:56 PM IST

Yentha-Vaadu-Gaani

తమిళ సూపర్ స్టార్ అజిత్, అనుష్క, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఎంతవాడు గాని’. ఇటివల తమిళంలో విడుదలైన ఈ చిత్రం(ఎన్నై ఆరిందాల్) మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. వెంకటేష్ ‘ఘర్షణ’, కమల్ హాసన్ ‘రాఘవన్’ చిత్రాల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మరో పోలీస్ ఆఫీసర్ స్టొరీ ఇది. అజిత్, అనుష్క, త్రిషల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. గత ఏడాది ‘వీరుడోక్కడే’ చిత్రంతో తెలుగు విజయాన్ని అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు