కూలీ ని ఫాలో అవుతున్న ‘అఖండ 2’

Akhanda-2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచాయి.

అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ తమిళ చిత్రం కూలీ స్ట్రాటెజీని ఫాలో అవుతున్నారు. తాజాగా ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా డెలివరీ పార్సెల్స్‌పై ‘అఖండ 2’ పోస్టర్స్‌ను పబ్లిష్ చేశారు. కూలీ చిత్రం ప్రమోషన్స్‌లోనూ ఈ విధమైన స్ట్రాటెజీ మనం చూశాం. అయితే, టాలీవుడ్‌లో ఇలాంటిది ఇదే మొదటిది కావడం విశేషం.

దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version