నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. కొన్ని ఇబ్బందులు నడుమ వచ్చినప్పటికీ ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత కూడా సినిమాపై చాలా నెగిటివ్ వచ్చేసింది.
కానీ సర్ప్రైజింగ్ గా అఖండ 2 ఇప్పటికీ కూడా తెలుగు స్టేట్స్ లో మంచి నిలకడ కనబరుస్తూ వచ్చింది. 12న విడుదల అయ్యి అంత నెగిటివ్ కూడా తట్టుకొని రెండు వారాల తర్వాత కూడా బుక్ మై షో ట్రెండింగ్ లో నిలుస్తుంది. అయితే ఇక్కడ బాగానే ఉన్నప్పటికీ యూఎస్ మార్కెట్ లో మాత్రం అఖండ 2 స్ట్రగుల్ అవుతుంది.
ఊహించని విధంగా ఆ సినిమా ఇప్పటికీ 1 మిలియన్ మార్క్ ని అందుకోకపోవడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకి నార్త్ అమెరికాలో పెట్టుకున్న టార్గెట్ ని కూడా రీచ్ కావడం అసాధ్యమే అని వినిపిస్తుంది. ఇలా అఖండ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనుకున్నా అక్కడ మాత్రం డ్యామేజ్ కొంచెం ఎఫెక్ట్ చేసింది.


