బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన “అఖండ”

Published on Jan 16, 2022 10:44 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అఖండ. వీరి కాంబో లో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు రాగా, అఖండ చిత్రం ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిన్నటితో 45వ రోజు ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు సెంటర్లలో హౌస్‌ఫుల్‌ గా రికార్డు సృష్టించింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయడం సినిమా సక్సెస్‌కి కారణం అని చెప్పాలి.

అఖండ బాలకృష్ణ కెరీర్ లో మొదటి 150 కోట్ల గ్రాసర్ చిత్రం గా నిలిచింది. ఇది ఇప్పటి వరకు హెయ్యస్ట్ అని చెప్పాలి. ఈ చిత్రం మంచి ఎక్కువ థియేటర్లలో 50 రోజుల రన్ దిశగా దూసుకుపోతోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :